Saturday, 23 November 2013

©®బుల్లి°™.......!!వీచే పవనాలు!11

©®బుల్లి°™.......!!వీచే పవనాలు!11 పవనాలు ఇటువైపుకి దారిమళ్ళాయి తొలకరి జల్లులా మొదలయ్యి నాలో ఏదో కొత ఉత్సాహాన్ని రేపింది చిరుజల్లులా కురిసి నాతో ఏదో చెప్పాలని కుతుహలాడింది నా బొంగురు గొంతుకకు కూడా భయపడలేదు నన్ను చూడకుండానే నానుండి ఏదో నేర్చుకోవాలని కుతుహలడింది పాపం దానికి తెలియదు నాకేమీ రాదని నేనొక విషాద యుగాన్నని దానికి తెలియదు నాపై కురవద్దు అని చెప్పలేను ఎందుకంటే ఒంటరిగా నాతో నేనే సంభాషించుకునే నేను మొదటిసారిగా నీగురించి తెలుసుకోవాలి అనేసందేహంతో అడిగాకా ఎలా వద్దనగలను కాని ఆ తొలకరి జల్లులు కాసేపే అని తెలుసుకోలేకపోయాను ఎప్పుడూ నాపైనే కురవాలి అనుకోవటం కాస్త అత్యాసే కదా మరొకరిపై కూడా కురవనీ 24-11-2013

Friday, 11 October 2013

//బుల్లి//.......!ఒంటరి!

//బుల్లి//.......!ఒంటరి!

నాకు స్పందన లేదు
నా హ్రుదయం నీవద్ద ఉంది కాబట్టి

నాకు చిరునవ్వంటే ఏమిటో తెలియదు
నీవు నావద్ద లేవు కాబట్టి

నాకు ఆశ్చర్యం కలుగదు
ఎందుకంటే నీవు నన్ను ఎన్నటికీ పిలువవు కాబట్టీ

అద్దంలో నన్ను నేను పోల్చుకోలేను
నేను నీలో ఐక్యమైపోయాను కాబట్టి

దూరమైనది కేవలం నీ తనువు మాత్రమే
నీ తలంపులు,నీఊసులు ఇప్పటికీ ఎప్పటికీ నాలో కదలాడుతూనే ఉంటాయి

చేరువైన నీతనువు కంటే
దూరమైన నామనసు లేక ఏం చేయాలో పాలుపోవటం లేదు

తనువిక్కడ
మనసెక్కడో
ఏమైదో ఎలా ఉందో నీకే తెలియాలి
అసలు ఉందో లేదో నీవే చెప్పాలి

అసలు ఎక్కడ ఉన్నా ఎందరితో కలిసి ఉన్నా
నీ ఊసులే నా తలంపుకొస్తున్నాయి
నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి

నిజానికి నీవులేక
నేను ఏకాంతంగా ఉన్నాను అనుకున్నా
ఇప్పుడే తెలిసింది
నేను ఏకాంతంగా లేను
ఒంటరిగా ఉన్నాను అని

11అక్టోబర్2013

Friday, 27 September 2013

//ఒంటరిజీవితం//

/ఒంటరిజీవితం//

ఒంటరిజీవితం ఎంత కష్టమో


అనుభవిస్తేనే తెలిసేది దాని లోతెంతో




కష్టాలతో కూడుకుని


ఆకలేస్తే బుక్కెడు బువ్వ పెత్తని భంధువులులేక


దెబ్బతగిలెతే చూసే దికానాలేక


కడుపుచేతపత్తుకుని


ఆకలిపోరాటం చేయటం ఎంతకష్టమో




తప్పుచేస్తే మందలించేవారు లేక


తనతప్పులును సరిదిద్దేవాడు లేక


తప్పక తప్పులను చేస్తూ


తప్పుడు మనిషిగా జీవించటం ఎంత కష్టమో




ఆకలేస్తే నేలవంక


దాహమేస్తే నింగి వంక


భాధ కలిగితే కన్నీటితో


సంతోషం కలిగితే అద్దంవైపు చూసి పొంగిపోవటం ఎంత కష్టమో




ఇది నాది అని చెప్పుకోవటానికి ఏమీలేక


నా అనేవాడే లేక


నలుదిక్కులనూ తన స్నేహితులను చేసుకుని


దేశదిమ్మరిలా దేశమంతా గాలించటం ఎంత కష్టమో




తనకంటూ ప్రత్యేకమైన అనుభంధాలు లేక


హ్రుదయంలోని ఒకింత అసహనంతో


మదిలోని భావోద్వేగాలను సమాధి చేసుకుని


ఒంటరితనంతో జీవించటం ఎంత కష్టమో




భాధ కలిగితే ఓదార్పునిచ్చే భంధువులు


ఆపదలో నేనున్నానంటూ చేయందించే ఆప్తులు


క్టిన సమయాల్లో సలహాలనిచ్చే మిత్రులు లేని


దుర్భరజీవితం గడపటం ఎంత కష్టమో




బ్రతికినంత కాలం 


తన జీవన బండిని తనే లాక్కొంటూ పోయే ఈఒంటరిని


పోయిన తరువాత కాటికి పంపుటకు నలుగురు లేక


చెత్తకుప్పల మధ్య క్రుళ్ళిక్రుశించిన మ్రుతదేహాన్ని


అదే చెత్తవ్యానులో పడేసి


డంపీయార్డులో దిక్కులేని శవంలా 


మట్టిలో జీర్ణించుకుపోయే 


దుర్భర చావుని మాత్రం అనుభవిస్తే కానీ తెలియదు




!!బుల్లి!!.............26-సెప్టెంబర్-2013


www.facebook.com/uday.raja143

Monday, 2 September 2013

!!పిచ్చి వెతుకులాట!!

!!పిచ్చి వెతుకులాట!!

ఇంకిపోతున్న నాహ్రుదయ బావిని
నాకన్నీటి చుక్కలతో నింపి తేల్పుతున్నా

నీబాటకు వెలుగు చూపించే నాప్రేమదీపం
ఆరిఫోకుండా నన్ను నేనే ఆహుతిచ్చుకుంటూ 
నీకు వెలుగుని పంచుతున్నాను
ఇంకెంతకాలం వెలుగుని పంచగలనో తెలియటంలేదు

ఒకప్పుడు నీనీడై ఉంటే చాలు అనుకున్నా
కానిప్పుడు చిరుగాలై నిన్ను తాకితే చాలు అనుకుంటున్నా

కలలు కనే కనులకు అంతులేదు అంటారు
కనీసం ఆకలలోనైనా నీకురులను తాకితే చాలు అనిపిస్తుంది

నిన్ను చూసిన క్షణం నుంచి
నామనసే నాఅదుపులో లేకుండా అయిపోయింది
నాఆలోచనలన్నీ నిన్నే స్ప్రుశిస్తున్నాయి
నాకనులు నీరాకకై ఎదురుచూస్తున్నాయి


నీ ఙ్ఞాపకాల అలజడిలో
కల్లోల కడలినై నీ పేరే జపిస్తూన్నా
ఈ క్షణం నీవు కనిపించవని తెలిసినా
నీ కోసమే ఎదురుచూస్తూన్నా...

పగలంతా కాపుకాచి 
రేయి నిదరౌతాడు
కాని నేను నీరాకై 
రేయి పగలు తేడా లేకుండా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నా

బుల్లి..............3-సెప్-13

Saturday, 10 August 2013

!!కదిలొచ్చిన నాహ్రుదయం!!


     !!కదిలొచ్చిన నాహ్రుదయం!!

వెలుగుతున్న దీపంలా


ఇంపైన జ్ఞాపికలా


సొంపైన అందంతో


చూపించావి నీ ప్రేమని




గలగల పారే సెలయేరులా


మిలమిల మెరిసే తారలా


తలతలలాడే మోముతో


కదిలించావు నా మదిని




ఇంతలోనే




కొండెక్కిన దీపంలా


విషాద స్రుతులను


నాలో విడిచిపెట్టి


కన్నీటి సంద్రంలోకి పడవేశావు




కరుగుతున్న హిమగిరిలా


విలవిలలాడే నా హ్రుదయం


మురిపించిన నీప్రేమకై


కదిలొచ్చింది నను విడిచి





బుల్లి........!!10ఆగష్ట్!!


https://www.facebook.com/uday.raja143

Followers