Saturday, 10 August 2013

!!కదిలొచ్చిన నాహ్రుదయం!!


     !!కదిలొచ్చిన నాహ్రుదయం!!

వెలుగుతున్న దీపంలా


ఇంపైన జ్ఞాపికలా


సొంపైన అందంతో


చూపించావి నీ ప్రేమని




గలగల పారే సెలయేరులా


మిలమిల మెరిసే తారలా


తలతలలాడే మోముతో


కదిలించావు నా మదిని




ఇంతలోనే




కొండెక్కిన దీపంలా


విషాద స్రుతులను


నాలో విడిచిపెట్టి


కన్నీటి సంద్రంలోకి పడవేశావు




కరుగుతున్న హిమగిరిలా


విలవిలలాడే నా హ్రుదయం


మురిపించిన నీప్రేమకై


కదిలొచ్చింది నను విడిచి





బుల్లి........!!10ఆగష్ట్!!


https://www.facebook.com/uday.raja143

Friday, 9 August 2013

నా కనులకు రెక్కలొచ్చాయ్.........

నా కనులకు రెక్కలొచ్చాయ్.........

నాస్వప్నానికి మెలుకువొచ్చింది

లేచిచూస్తే ఆశలు ఆవిరై


నిరీక్షణ విఫలమై


ఒంటరితనం అంబరాన్ని తాకింది




అలుపెరగని ఆలోచనలకు


మరుపెరగని అనుభవాలకు


చేరువవుతున్న గమ్యాలకు


దిశలెరుగని కెరటం వంటి నా జీవితానికి

రెక్కలొచ్చి తెలియని చిరునామాకై

పడిగాపులు కాచిన హ్రుదయానికి విసుగుపుట్టి

కారుమేఘంవలె ప్రపంచాన్ని చుట్టుతూ

అలసటలేని సూర్యకిరణాలవలె

ప్రస్తుతాన్ని చూపే అద్దంవలె

ఒంటరితనాన్ని గడుపుతూ

ఏకాకిలా ఎదురుచూస్తున్నాను


bulli...............6aug13


https://www.facebook.com/uday.raja143

II కరుగుతున్న స్వప్నం II

II కరుగుతున్న స్వప్నం II


నా స్వప్నం కరిగి పోతోంది 


ఆశలను ఆవిరి చేస్తూ 


నిరీక్షణలను విఫలం చేస్తూ...


ఒంటరితనం అంబరాన్ని తాకుతోంది 


అలుపెరగని ఆలోచనలకు తెర తీస్తూ 


మరుపుకు నోచని అనుభవాలను మెలిపెడుతూ 


చేరువవుతున్న గమ్యాలకు ఘోరీ కడుతూ.

దిశలెరుగని జీవితానికి

రెక్కలోచ్చాయేమో,


చెలి చిరునామాకై

పదే పదే వెదికి వేసారిన హృదయానికి

సాంత్వన దొరుకుతుందేమో .

కారుమబ్బులే చుట్టూ కమ్మేస్తూ ,

మండే కిరణాలే మదిని గిచ్చేస్తూ

మనసు అద్దంలో చెలి ప్రతిబింబం

నా ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ...


bulli............8/8/2013

బుల్లి........నేనొక శాపగ్రస్తుడిని

బుల్లి........నేనొక శాపగ్రస్తుడిని

నేనొక శాపగ్రస్తుడిని
బ్రతుకు అనే శాపాన్ని అనుభవిస్తూ
అశాశ్వతం అనే దేవుడిని
చావు అనే వరాన్ననుగ్రహించమని
జీవితం అనే తపస్సునే చేస్తున్నా

భంధాలు విడిచి
అనురాగాలు మరచి
అనుభవాలని పాఠాలుగా మలిచి
జీవితమనే చదరంగంలో
పదహారు అడుగులకై పరితపిస్తున్నా

ఎంతటి ప్రళయం వచ్చినా
ప్రపంచంలో శంతి నెలకొంటుందని
కాకపోతే కొంతసమయం పడుతుందని
నా జీవితం ఒక పాఠం నేర్పింది

విషాద చాయలు
రంగుహంగులద్దుకుని
వేయి పడగలు పెట్టుకుని
ఆనందలోకంలో ధుఖపు కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి


bulli........8-8-2013


https://www.facebook.com/uday.raja143

Friday, 2 August 2013

బుల్లి.......కలగలిపిన స్వప్నం నాది



అంబరాన్నంటాలనే కోరికతో


ఆశలనే రెక్కనను తొడిగి


ప్రేమ అనే దిక్సూచి సహాయంతో


జీవితమనే గమ్యంతో

ఆలోచనలనే వేగంతో

ఎగిరిపోతున్న నాకు

భయమనే ప్రతినాయకుడితో

ధుఖం అనే యుద్దం చేస్తూ

కాలమనే కన్నీటి సంద్రంలో

వేదన అనే ఒంటరి ఓడపై పడిన నేను(నన్ను)

భంధం అనే కెరటాలు

ఆత్మీయతా అనే గమ్యం వైపు తీసుకెళుతుంటే

అశాశ్వతం అనే గరుఢ పక్షి

మరణం అనే దీవిలో పడేసింది



అక్కడ

ఆనందమనే అంచుల్లో

స్నేహం అనే మేఘంపై

ప్రేమ అనే సూర్యుడు

వాత్సల్యమనే కిరణాలను వెదజల్లుతున్నాడు



నమ్మకం అనే విశ్వంలో

విశ్వాశం అనే గ్రహాలుండగా

ద్రోహం అనే ఉల్కల సామ్రాజ్యం

శాంతి అనే భూగ్రహంపై

పైసా అనే ఆయుధంతో
వ్యాపారపు ముసుగులో

దండెత్తి వస్తున్నాయి



పుణ్యం అనే మనుషులు

స్వార్ధం అనే ధనం కోసం

పాపం అనే ద్రోహపు వ్యాపారాన్ని

పుష్కలం అనే ఈప్రపంచంలో మొదలుపెట్టి

సైతాన్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నారు


2ఆగష్ట్13


https://www.facebook.com/uday.raja143

Followers