Saturday, 23 November 2013
©®బుల్లి°™.......!!వీచే పవనాలు!11
©®బుల్లి°™.......!!వీచే పవనాలు!11
పవనాలు ఇటువైపుకి దారిమళ్ళాయి
తొలకరి జల్లులా మొదలయ్యి
నాలో ఏదో కొత ఉత్సాహాన్ని రేపింది
చిరుజల్లులా కురిసి
నాతో ఏదో చెప్పాలని కుతుహలాడింది
నా బొంగురు గొంతుకకు కూడా భయపడలేదు
నన్ను చూడకుండానే
నానుండి ఏదో నేర్చుకోవాలని కుతుహలడింది
పాపం దానికి తెలియదు నాకేమీ రాదని
నేనొక విషాద యుగాన్నని దానికి తెలియదు
నాపై కురవద్దు అని చెప్పలేను
ఎందుకంటే ఒంటరిగా నాతో నేనే సంభాషించుకునే నేను
మొదటిసారిగా నీగురించి తెలుసుకోవాలి
అనేసందేహంతో అడిగాకా ఎలా వద్దనగలను
కాని ఆ తొలకరి జల్లులు
కాసేపే అని తెలుసుకోలేకపోయాను
ఎప్పుడూ నాపైనే కురవాలి అనుకోవటం
కాస్త అత్యాసే కదా
మరొకరిపై కూడా కురవనీ
24-11-2013
Friday, 15 November 2013
Friday, 11 October 2013
//బుల్లి//.......!ఒంటరి!
//బుల్లి//.......!ఒంటరి!
నాకు స్పందన లేదు
నా హ్రుదయం నీవద్ద ఉంది కాబట్టి
నాకు చిరునవ్వంటే ఏమిటో తెలియదు
నీవు నావద్ద లేవు కాబట్టి
నాకు ఆశ్చర్యం కలుగదు
ఎందుకంటే నీవు నన్ను ఎన్నటికీ పిలువవు కాబట్టీ
అద్దంలో నన్ను నేను పోల్చుకోలేను
నేను నీలో ఐక్యమైపోయాను కాబట్టి
దూరమైనది కేవలం నీ తనువు మాత్రమే
నీ తలంపులు,నీఊసులు ఇప్పటికీ ఎప్పటికీ నాలో కదలాడుతూనే ఉంటాయి
చేరువైన నీతనువు కంటే
దూరమైన నామనసు లేక ఏం చేయాలో పాలుపోవటం లేదు
తనువిక్కడ
మనసెక్కడో
ఏమైదో ఎలా ఉందో నీకే తెలియాలి
అసలు ఉందో లేదో నీవే చెప్పాలి
అసలు ఎక్కడ ఉన్నా ఎందరితో కలిసి ఉన్నా
నీ ఊసులే నా తలంపుకొస్తున్నాయి
నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి
నిజానికి నీవులేక
నేను ఏకాంతంగా ఉన్నాను అనుకున్నా
ఇప్పుడే తెలిసింది
నేను ఏకాంతంగా లేను
ఒంటరిగా ఉన్నాను అని
11అక్టోబర్2013
నాకు స్పందన లేదు
నా హ్రుదయం నీవద్ద ఉంది కాబట్టి
నాకు చిరునవ్వంటే ఏమిటో తెలియదు
నీవు నావద్ద లేవు కాబట్టి
నాకు ఆశ్చర్యం కలుగదు
ఎందుకంటే నీవు నన్ను ఎన్నటికీ పిలువవు కాబట్టీ
అద్దంలో నన్ను నేను పోల్చుకోలేను
నేను నీలో ఐక్యమైపోయాను కాబట్టి
దూరమైనది కేవలం నీ తనువు మాత్రమే
నీ తలంపులు,నీఊసులు ఇప్పటికీ ఎప్పటికీ నాలో కదలాడుతూనే ఉంటాయి
చేరువైన నీతనువు కంటే
దూరమైన నామనసు లేక ఏం చేయాలో పాలుపోవటం లేదు
తనువిక్కడ
మనసెక్కడో
ఏమైదో ఎలా ఉందో నీకే తెలియాలి
అసలు ఉందో లేదో నీవే చెప్పాలి
అసలు ఎక్కడ ఉన్నా ఎందరితో కలిసి ఉన్నా
నీ ఊసులే నా తలంపుకొస్తున్నాయి
నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి
నిజానికి నీవులేక
నేను ఏకాంతంగా ఉన్నాను అనుకున్నా
ఇప్పుడే తెలిసింది
నేను ఏకాంతంగా లేను
ఒంటరిగా ఉన్నాను అని
11అక్టోబర్2013
Friday, 27 September 2013
//ఒంటరిజీవితం//
/ఒంటరిజీవితం//
ఒంటరిజీవితం ఎంత కష్టమో
అనుభవిస్తేనే తెలిసేది దాని లోతెంతో
కష్టాలతో కూడుకుని
ఆకలేస్తే బుక్కెడు బువ్వ పెత్తని భంధువులులేక
దెబ్బతగిలెతే చూసే దికానాలేక
కడుపుచేతపత్తుకుని
ఆకలిపోరాటం చేయటం ఎంతకష్టమో
తప్పుచేస్తే మందలించేవారు లేక
తనతప్పులును సరిదిద్దేవాడు లేక
తప్పక తప్పులను చేస్తూ
తప్పుడు మనిషిగా జీవించటం ఎంత కష్టమో
ఆకలేస్తే నేలవంక
దాహమేస్తే నింగి వంక
భాధ కలిగితే కన్నీటితో
సంతోషం కలిగితే అద్దంవైపు చూసి పొంగిపోవటం ఎంత కష్టమో
ఇది నాది అని చెప్పుకోవటానికి ఏమీలేక
నా అనేవాడే లేక
నలుదిక్కులనూ తన స్నేహితులను చేసుకుని
దేశదిమ్మరిలా దేశమంతా గాలించటం ఎంత కష్టమో
తనకంటూ ప్రత్యేకమైన అనుభంధాలు లేక
హ్రుదయంలోని ఒకింత అసహనంతో
మదిలోని భావోద్వేగాలను సమాధి చేసుకుని
ఒంటరితనంతో జీవించటం ఎంత కష్టమో
భాధ కలిగితే ఓదార్పునిచ్చే భంధువులు
ఆపదలో నేనున్నానంటూ చేయందించే ఆప్తులు
క్టిన సమయాల్లో సలహాలనిచ్చే మిత్రులు లేని
దుర్భరజీవితం గడపటం ఎంత కష్టమో
బ్రతికినంత కాలం
తన జీవన బండిని తనే లాక్కొంటూ పోయే ఈఒంటరిని
పోయిన తరువాత కాటికి పంపుటకు నలుగురు లేక
చెత్తకుప్పల మధ్య క్రుళ్ళిక్రుశించిన మ్రుతదేహాన్ని
అదే చెత్తవ్యానులో పడేసి
డంపీయార్డులో దిక్కులేని శవంలా
మట్టిలో జీర్ణించుకుపోయే
దుర్భర చావుని మాత్రం అనుభవిస్తే కానీ తెలియదు
!!బుల్లి!!.............26-సెప్టెంబర్-2013
www.facebook.com/uday.raja143
ఒంటరిజీవితం ఎంత కష్టమో
అనుభవిస్తేనే తెలిసేది దాని లోతెంతో
కష్టాలతో కూడుకుని
ఆకలేస్తే బుక్కెడు బువ్వ పెత్తని భంధువులులేక
దెబ్బతగిలెతే చూసే దికానాలేక
కడుపుచేతపత్తుకుని
ఆకలిపోరాటం చేయటం ఎంతకష్టమో
తప్పుచేస్తే మందలించేవారు లేక
తనతప్పులును సరిదిద్దేవాడు లేక
తప్పక తప్పులను చేస్తూ
తప్పుడు మనిషిగా జీవించటం ఎంత కష్టమో
ఆకలేస్తే నేలవంక
దాహమేస్తే నింగి వంక
భాధ కలిగితే కన్నీటితో
సంతోషం కలిగితే అద్దంవైపు చూసి పొంగిపోవటం ఎంత కష్టమో
ఇది నాది అని చెప్పుకోవటానికి ఏమీలేక
నా అనేవాడే లేక
నలుదిక్కులనూ తన స్నేహితులను చేసుకుని
దేశదిమ్మరిలా దేశమంతా గాలించటం ఎంత కష్టమో
తనకంటూ ప్రత్యేకమైన అనుభంధాలు లేక
హ్రుదయంలోని ఒకింత అసహనంతో
మదిలోని భావోద్వేగాలను సమాధి చేసుకుని
ఒంటరితనంతో జీవించటం ఎంత కష్టమో
భాధ కలిగితే ఓదార్పునిచ్చే భంధువులు
ఆపదలో నేనున్నానంటూ చేయందించే ఆప్తులు
క్టిన సమయాల్లో సలహాలనిచ్చే మిత్రులు లేని
దుర్భరజీవితం గడపటం ఎంత కష్టమో
బ్రతికినంత కాలం
తన జీవన బండిని తనే లాక్కొంటూ పోయే ఈఒంటరిని
పోయిన తరువాత కాటికి పంపుటకు నలుగురు లేక
చెత్తకుప్పల మధ్య క్రుళ్ళిక్రుశించిన మ్రుతదేహాన్ని
అదే చెత్తవ్యానులో పడేసి
డంపీయార్డులో దిక్కులేని శవంలా
మట్టిలో జీర్ణించుకుపోయే
దుర్భర చావుని మాత్రం అనుభవిస్తే కానీ తెలియదు
!!బుల్లి!!.............26-సెప్టెంబర్-2013
www.facebook.com/uday.raja143
Monday, 2 September 2013
!!పిచ్చి వెతుకులాట!!
!!పిచ్చి వెతుకులాట!!
ఇంకిపోతున్న నాహ్రుదయ బావిని
నాకన్నీటి చుక్కలతో నింపి తేల్పుతున్నా
నీబాటకు వెలుగు చూపించే నాప్రేమదీపం
ఆరిఫోకుండా నన్ను నేనే ఆహుతిచ్చుకుంటూ
నీకు వెలుగుని పంచుతున్నాను
ఇంకెంతకాలం వెలుగుని పంచగలనో తెలియటంలేదు
ఒకప్పుడు నీనీడై ఉంటే చాలు అనుకున్నా
కానిప్పుడు చిరుగాలై నిన్ను తాకితే చాలు అనుకుంటున్నా
కలలు కనే కనులకు అంతులేదు అంటారు
కనీసం ఆకలలోనైనా నీకురులను తాకితే చాలు అనిపిస్తుంది
నిన్ను చూసిన క్షణం నుంచి
నామనసే నాఅదుపులో లేకుండా అయిపోయింది
నాఆలోచనలన్నీ నిన్నే స్ప్రుశిస్తున్నాయి
నాకనులు నీరాకకై ఎదురుచూస్తున్నాయి
నీ ఙ్ఞాపకాల అలజడిలో
కల్లోల కడలినై నీ పేరే జపిస్తూన్నా
ఈ క్షణం నీవు కనిపించవని తెలిసినా
నీ కోసమే ఎదురుచూస్తూన్నా...
పగలంతా కాపుకాచి
రేయి నిదరౌతాడు
కాని నేను నీరాకై
రేయి పగలు తేడా లేకుండా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నా
బుల్లి..............3-సెప్-13
ఇంకిపోతున్న నాహ్రుదయ బావిని
నాకన్నీటి చుక్కలతో నింపి తేల్పుతున్నా
నీబాటకు వెలుగు చూపించే నాప్రేమదీపం
ఆరిఫోకుండా నన్ను నేనే ఆహుతిచ్చుకుంటూ
నీకు వెలుగుని పంచుతున్నాను
ఇంకెంతకాలం వెలుగుని పంచగలనో తెలియటంలేదు
ఒకప్పుడు నీనీడై ఉంటే చాలు అనుకున్నా
కానిప్పుడు చిరుగాలై నిన్ను తాకితే చాలు అనుకుంటున్నా
కలలు కనే కనులకు అంతులేదు అంటారు
కనీసం ఆకలలోనైనా నీకురులను తాకితే చాలు అనిపిస్తుంది
నిన్ను చూసిన క్షణం నుంచి
నామనసే నాఅదుపులో లేకుండా అయిపోయింది
నాఆలోచనలన్నీ నిన్నే స్ప్రుశిస్తున్నాయి
నాకనులు నీరాకకై ఎదురుచూస్తున్నాయి
నీ ఙ్ఞాపకాల అలజడిలో
కల్లోల కడలినై నీ పేరే జపిస్తూన్నా
ఈ క్షణం నీవు కనిపించవని తెలిసినా
నీ కోసమే ఎదురుచూస్తూన్నా...
పగలంతా కాపుకాచి
రేయి నిదరౌతాడు
కాని నేను నీరాకై
రేయి పగలు తేడా లేకుండా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నా
బుల్లి..............3-సెప్-13
Saturday, 10 August 2013
!!కదిలొచ్చిన నాహ్రుదయం!!
!!కదిలొచ్చిన నాహ్రుదయం!!
వెలుగుతున్న దీపంలా
ఇంపైన జ్ఞాపికలా
సొంపైన అందంతో
చూపించావి నీ ప్రేమని
గలగల పారే సెలయేరులా
మిలమిల మెరిసే తారలా
తలతలలాడే మోముతో
కదిలించావు నా మదిని
ఇంతలోనే
కొండెక్కిన దీపంలా
విషాద స్రుతులను
నాలో విడిచిపెట్టి
కన్నీటి సంద్రంలోకి పడవేశావు
కరుగుతున్న హిమగిరిలా
విలవిలలాడే నా హ్రుదయం
మురిపించిన నీప్రేమకై
కదిలొచ్చింది నను విడిచి
బుల్లి........!!10ఆగష్ట్!!
https://www.facebook.com/uday.raja143
Friday, 9 August 2013
నా కనులకు రెక్కలొచ్చాయ్.........
నా కనులకు రెక్కలొచ్చాయ్.........
నాస్వప్నానికి మెలుకువొచ్చింది
లేచిచూస్తే ఆశలు ఆవిరై
నిరీక్షణ విఫలమై
ఒంటరితనం అంబరాన్ని తాకింది
అలుపెరగని ఆలోచనలకు
మరుపెరగని అనుభవాలకు
చేరువవుతున్న గమ్యాలకు
దిశలెరుగని కెరటం వంటి నా జీవితానికి
రెక్కలొచ్చి తెలియని చిరునామాకై
పడిగాపులు కాచిన హ్రుదయానికి విసుగుపుట్టి
కారుమేఘంవలె ప్రపంచాన్ని చుట్టుతూ
అలసటలేని సూర్యకిరణాలవలె
ప్రస్తుతాన్ని చూపే అద్దంవలె
ఒంటరితనాన్ని గడుపుతూ
ఏకాకిలా ఎదురుచూస్తున్నాను
bulli...............6aug13
https://www.facebook.com/uday.raja143
నాస్వప్నానికి మెలుకువొచ్చింది
లేచిచూస్తే ఆశలు ఆవిరై
నిరీక్షణ విఫలమై
ఒంటరితనం అంబరాన్ని తాకింది
అలుపెరగని ఆలోచనలకు
మరుపెరగని అనుభవాలకు
చేరువవుతున్న గమ్యాలకు
దిశలెరుగని కెరటం వంటి నా జీవితానికి
రెక్కలొచ్చి తెలియని చిరునామాకై
పడిగాపులు కాచిన హ్రుదయానికి విసుగుపుట్టి
కారుమేఘంవలె ప్రపంచాన్ని చుట్టుతూ
అలసటలేని సూర్యకిరణాలవలె
ప్రస్తుతాన్ని చూపే అద్దంవలె
ఒంటరితనాన్ని గడుపుతూ
ఏకాకిలా ఎదురుచూస్తున్నాను
bulli...............6aug13
https://www.facebook.com/uday.raja143
II కరుగుతున్న స్వప్నం II
II కరుగుతున్న స్వప్నం II
నా స్వప్నం కరిగి పోతోంది
ఆశలను ఆవిరి చేస్తూ
నిరీక్షణలను విఫలం చేస్తూ...
ఒంటరితనం అంబరాన్ని తాకుతోంది
అలుపెరగని ఆలోచనలకు తెర తీస్తూ
మరుపుకు నోచని అనుభవాలను మెలిపెడుతూ
చేరువవుతున్న గమ్యాలకు ఘోరీ కడుతూ.
దిశలెరుగని జీవితానికి
రెక్కలోచ్చాయేమో,
చెలి చిరునామాకై
పదే పదే వెదికి వేసారిన హృదయానికి
సాంత్వన దొరుకుతుందేమో .
కారుమబ్బులే చుట్టూ కమ్మేస్తూ ,
మండే కిరణాలే మదిని గిచ్చేస్తూ
మనసు అద్దంలో చెలి ప్రతిబింబం
నా ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ...
bulli............8/8/2013
బుల్లి........నేనొక శాపగ్రస్తుడిని
బుల్లి........నేనొక శాపగ్రస్తుడిని
నేనొక శాపగ్రస్తుడిని
బ్రతుకు అనే శాపాన్ని అనుభవిస్తూ
అశాశ్వతం అనే దేవుడిని
చావు అనే వరాన్ననుగ్రహించమని
జీవితం అనే తపస్సునే చేస్తున్నా
భంధాలు విడిచి
అనురాగాలు మరచిఅనుభవాలని పాఠాలుగా మలిచి
జీవితమనే చదరంగంలో
పదహారు అడుగులకై పరితపిస్తున్నా
ఎంతటి ప్రళయం వచ్చినా
ప్రపంచంలో శంతి నెలకొంటుందని
కాకపోతే కొంతసమయం పడుతుందని
నా జీవితం ఒక పాఠం నేర్పింది
విషాద చాయలు
రంగుహంగులద్దుకుని
వేయి పడగలు పెట్టుకుని
ఆనందలోకంలో ధుఖపు కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి
bulli........8-8-2013
https://www.facebook.com/uday.raja143
నేనొక శాపగ్రస్తుడిని
బ్రతుకు అనే శాపాన్ని అనుభవిస్తూ
అశాశ్వతం అనే దేవుడిని
చావు అనే వరాన్ననుగ్రహించమని
జీవితం అనే తపస్సునే చేస్తున్నా
భంధాలు విడిచి
అనురాగాలు మరచిఅనుభవాలని పాఠాలుగా మలిచి
జీవితమనే చదరంగంలో
పదహారు అడుగులకై పరితపిస్తున్నా
ఎంతటి ప్రళయం వచ్చినా
ప్రపంచంలో శంతి నెలకొంటుందని
కాకపోతే కొంతసమయం పడుతుందని
నా జీవితం ఒక పాఠం నేర్పింది
విషాద చాయలు
రంగుహంగులద్దుకుని
వేయి పడగలు పెట్టుకుని
ఆనందలోకంలో ధుఖపు కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి
bulli........8-8-2013
https://www.facebook.com/uday.raja143
Friday, 2 August 2013
బుల్లి.......కలగలిపిన స్వప్నం నాది
అంబరాన్నంటాలనే కోరికతో
ఆశలనే రెక్కనను తొడిగి
ప్రేమ అనే దిక్సూచి సహాయంతో
జీవితమనే గమ్యంతో
ఆలోచనలనే వేగంతో
ఎగిరిపోతున్న నాకు
భయమనే ప్రతినాయకుడితో
ధుఖం అనే యుద్దం చేస్తూ
కాలమనే కన్నీటి సంద్రంలో
వేదన అనే ఒంటరి ఓడపై పడిన నేను(నన్ను)
భంధం అనే కెరటాలు
ఆత్మీయతా అనే గమ్యం వైపు తీసుకెళుతుంటే
అశాశ్వతం అనే గరుఢ పక్షి
మరణం అనే దీవిలో పడేసింది
అక్కడ
ఆనందమనే అంచుల్లో
స్నేహం అనే మేఘంపై
ప్రేమ అనే సూర్యుడు
వాత్సల్యమనే కిరణాలను వెదజల్లుతున్నాడు
నమ్మకం అనే విశ్వంలో
విశ్వాశం అనే గ్రహాలుండగా
ద్రోహం అనే ఉల్కల సామ్రాజ్యం
శాంతి అనే భూగ్రహంపై
దండెత్తి వస్తున్నాయి
పుణ్యం అనే మనుషులు
స్వార్ధం అనే ధనం కోసం
పాపం అనే ద్రోహపు వ్యాపారాన్ని
పుష్కలం అనే ఈప్రపంచంలో మొదలుపెట్టి
సైతాన్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నారు
2ఆగష్ట్13
https://www.facebook.com/uday.raja143
అంబరాన్నంటాలనే కోరికతో
ఆశలనే రెక్కనను తొడిగి
ప్రేమ అనే దిక్సూచి సహాయంతో
జీవితమనే గమ్యంతో
ఆలోచనలనే వేగంతో
ఎగిరిపోతున్న నాకు
భయమనే ప్రతినాయకుడితో
ధుఖం అనే యుద్దం చేస్తూ
కాలమనే కన్నీటి సంద్రంలో
వేదన అనే ఒంటరి ఓడపై పడిన నేను(నన్ను)
భంధం అనే కెరటాలు
ఆత్మీయతా అనే గమ్యం వైపు తీసుకెళుతుంటే
అశాశ్వతం అనే గరుఢ పక్షి
మరణం అనే దీవిలో పడేసింది
అక్కడ
ఆనందమనే అంచుల్లో
స్నేహం అనే మేఘంపై
ప్రేమ అనే సూర్యుడు
వాత్సల్యమనే కిరణాలను వెదజల్లుతున్నాడు
నమ్మకం అనే విశ్వంలో
విశ్వాశం అనే గ్రహాలుండగా
ద్రోహం అనే ఉల్కల సామ్రాజ్యం
శాంతి అనే భూగ్రహంపై
పైసా అనే ఆయుధంతో
వ్యాపారపు ముసుగులోదండెత్తి వస్తున్నాయి
పుణ్యం అనే మనుషులు
స్వార్ధం అనే ధనం కోసం
పాపం అనే ద్రోహపు వ్యాపారాన్ని
పుష్కలం అనే ఈప్రపంచంలో మొదలుపెట్టి
సైతాన్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నారు
2ఆగష్ట్13
https://www.facebook.com/uday.raja143
Tuesday, 30 July 2013
స్వప్నం లోంచి పుట్టిన కవిత్వం
మనసులను వూహింప చేస్తుంది !
జీవితం నేర్పిన కవిత్వం
అలసిన మనసులను వూరడిస్తుంది !
https://www.facebook.com/uday.raja143
i am always waiting for you
బెదిరిన మనసు
బాధించిన మనిషి పై
రాసిందిలా ఓ కవనం....
విరహాల చీకటి తెరపై
వెన్నెలతో నీ రూపమే చిత్రిస్తూన్నా
నీ ఙ్ఞాపకాల అలజడిలో
కల్లోల కడలినై నీ పేరే జపిస్తూన్నా
ఈ క్షణం నీవు కనిపించవని తెలిసినా
నీ కోసమే ఎదురుచూస్తూన్నా...
Friday, 26 July 2013
బుల్లి..........కాకకూటమిలో ఎన్నో ఎన్నెన్నో
కాల గర్భంలో కొట్టుకుపోయిన జీవితాలెన్నో
కాల చక్రంలో తిరుగుతున్న మనుషులం మనం
కాలానికి బానిసలం మనం
కాలానికనుగుణంగా నడుచుకోకపోతే
ఆ కాలనాగు కాలవిషానికి ఆహుతి అవ్వాల్సిందే
కాలం అరుదైనది
కాలం సున్నితమైనది
అనుభవించుకునే సామర్ధ్యం ఉంటేనే
ఇక్కడ జీవితం
లేదంటే చెత్తకుప్పలపైనే నీబ్రతుకు
26జూలై13
https://www.facebook.com/uday.raja143
suma shanthi
పల్లవించిన ప్రణయం
మధుర ప్రబంధంగా రూపొంది
అనురాగ శిఖరాన నిలిచి
మమతల వెలుగులు వెదజల్లి
మనసులు మైమరపించి
జీవితాన మధురిమలు నింపింది..... సుకు
https://www.facebook.com/suma.shanthi.5
మధుర ప్రబంధంగా రూపొంది
అనురాగ శిఖరాన నిలిచి
మమతల వెలుగులు వెదజల్లి
మనసులు మైమరపించి
జీవితాన మధురిమలు నింపింది..... సుకు
https://www.facebook.com/suma.shanthi.5
suma shanthi
జీవితం
అంతులేని అగాధంలా
భయం గొల్పుతుంది చాలా
ఆశలెన్నో ఉన్నాయి మదిలో
వేదనే మిగిలింది వాస్తవంలో
ఆత్మీయత అరుదై
అనురాగం కరువై
మోడువారిన చెట్టులా
రాలిపోవాలా మట్టిలో ..... సుకు
https://www.facebook.com/suma.shanthi.5
అంతులేని అగాధంలా
భయం గొల్పుతుంది చాలా
ఆశలెన్నో ఉన్నాయి మదిలో
వేదనే మిగిలింది వాస్తవంలో
ఆత్మీయత అరుదై
అనురాగం కరువై
మోడువారిన చెట్టులా
రాలిపోవాలా మట్టిలో ..... సుకు
https://www.facebook.com/suma.shanthi.5
Tuesday, 23 July 2013
బుల్లి...చిక్కు ముడి
బుల్లి...చిక్కు ముడి
భవిష్యత్తు మీద ఏదో ఆలోచన
ఏదో కోల్పోయానన్న ఆవేదన
జీవితం మీద చిన్న ఆశ
తనువుతో సమానంగా
మనసులోని అలజడి పెరుగుతున్నట్లుగా
ఏదో తప్పుచేశానన్న ఆందోళన
ఎదురుపడ్డ అనుకోని సంఘటణ
తప్పించుకోవాలన్నా తప్పించుకోలేని పరిస్థితి
తప్పక తప్పుచేశానన్న భావన
ఆవేశంలోనో లేకా అనుకోకుండానో
చేసిన పొరపాటు
సరిదిద్దుకోలేని పొరపాటు చేశాను
ఎప్పటికైనా విప్పకపోతాన్ ఈ చిక్కు ముడి 24జూలై13
భవిష్యత్తు మీద ఏదో ఆలోచన
ఏదో కోల్పోయానన్న ఆవేదన
జీవితం మీద చిన్న ఆశ
తనువుతో సమానంగా
మనసులోని అలజడి పెరుగుతున్నట్లుగా
ఏదో తప్పుచేశానన్న ఆందోళన
ఎదురుపడ్డ అనుకోని సంఘటణ
తప్పించుకోవాలన్నా తప్పించుకోలేని పరిస్థితి
తప్పక తప్పుచేశానన్న భావన
ఆవేశంలోనో లేకా అనుకోకుండానో
చేసిన పొరపాటు
సరిదిద్దుకోలేని పొరపాటు చేశాను
ఎప్పటికైనా విప్పకపోతాన్ ఈ చిక్కు ముడి 24జూలై13
Mehdi Ali !! నన్ను ప్రేమించలేవు ... !!
ప్రేమపై నీకోక నిర్దిష్టమైన
అభిప్రాయం రానంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
ప్రేమపై నీకున్న కోలామానంతో
సరిచూసుకున్నంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
నమ్మకం అంటే సరైన నిర్వచనం
తెలియనంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
ఆరాధించే వాళ్ళు ఎందరో ఉన్నారనే
అహం నీలో ఉన్నంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
అందరి అభినందనల మత్తు
నీనుండి దిగనంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
ఇతరుల్లోని అంశాలతో
పోల్చి చూస్తున్నంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
అన్నీ ప్రత్యేకలు ఏ ఒక్కరిలో ఉండవన్న
నిజాలు గుర్తించినంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
నీ జీవితాన్ని రహస్యంగా
ఉంచినంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
నా ఆహ్వానంలోని ఆర్ద్రత
నిన్ను కదిలించినంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
నా కవితలోని భావాలు నీకేనని తెల్సిన
మౌనం ఉన్నంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
నీ భావాల్లో నేను ఉంటాననే
నమ్మకం నాలో కల్గించనంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు
Kodanda Rao కె.కె//గుప్పెడు మల్లెలు-43// *********************
1.
గుచ్చుకుందని
నొచ్చుకోకు,
కలిపికుట్టే సూదిమొనది.
2.
వెలుగు,చీకట్లొక్కటే
ఆకాశానికి,
కారణాలు వెతక్కు వైరాగ్యానికి
3.
తమమాటే వేదమట,
పంది పొర్లే బురదే,
దానికి సెలయేరు మరి.
4.
వరదొస్తే పైర్లకే కాదు,
గట్లకికూడా ముంపే,
స్వాభిమానం సరిహద్దులెన్ను.
5.
ఎంత దాస్తావ్?కొంత పంచు,
పౌడరద్దిన ఒళ్లుకూడా,
పోయినాక నీదికాదోయ్.
6.
అడివైనా,గుడినైనా
వెన్నెలొక్కటే,
కొందరికే పై చదువా?
7.
ఎవ్వడురా రైతు,
ఎదిగే అడవికి?
స్కేలుందా విజ్ఞానపు నిడివికి?
8.
పుస్తకం తిరగేస్తేనే,
మస్తకం పదునెక్కదులే,
గుండె తలుపు తట్టాలంతే.
9.
చూపులెక్కడ
పాతేశావ్?
పుట్టినూరు పిలుస్తుంటే.
10.
సముద్రం కళ్లెర్రజేస్తే
ఉలికులికి పడతావ్?
చెమటకూడా ఉప్పునీరేనోయ్.
====================
Date: 22/07/2013
-Kanithi Krishna Chaitanya
రోజులు వాటంతట అవే గడిచిపోతున్నాయి., ఎలాగోలాగ...,
కానీ, రాత్రులే., నను ఒంటరిని చేసి చంపుతున్నాయి....
గాయాలు ఎన్నటికైనా మానిపోతాయి...,
కానీ., గుర్తులు అలాగే మిగిలిపోతాయి....
విలాసవంతమైన నా పడక మీద...,
విశ్రమించడానికి నేను చేస్తున్నా విశ్వప్రయత్నాలు....
కానీ ఆలోచనలకు విరామం ఇవ్వలేకున్నా....
ఆ అలోచనల భారాన్ని మోయలేకున్నా...
నా గతం నా కళ్ళ ముందు మెదులుతోంది...,
అగ్ని కీలగా మారి నన్ను నిలువునా దహించివేస్తోంది....
కానరాని చీకట్లలో నా జీవితంలోని చీకటి స్ఫుటంగా కనిపిస్తోంది....
నాకు ఆ చీకటితో గొంతు కలపాలని ఉంది.,
ఈ నిశితో కసి తీరా మాట్లాడాలని ఉంది...,
ఎందుకంటే నా జీవితంలో ఇక మిగిలింది అదేగా మరి...
-Kanithi Krishna Chaitanya
కానీ, రాత్రులే., నను ఒంటరిని చేసి చంపుతున్నాయి....
గాయాలు ఎన్నటికైనా మానిపోతాయి...,
కానీ., గుర్తులు అలాగే మిగిలిపోతాయి....
విలాసవంతమైన నా పడక మీద...,
విశ్రమించడానికి నేను చేస్తున్నా విశ్వప్రయత్నాలు....
కానీ ఆలోచనలకు విరామం ఇవ్వలేకున్నా....
ఆ అలోచనల భారాన్ని మోయలేకున్నా...
నా గతం నా కళ్ళ ముందు మెదులుతోంది...,
అగ్ని కీలగా మారి నన్ను నిలువునా దహించివేస్తోంది....
కానరాని చీకట్లలో నా జీవితంలోని చీకటి స్ఫుటంగా కనిపిస్తోంది....
నాకు ఆ చీకటితో గొంతు కలపాలని ఉంది.,
ఈ నిశితో కసి తీరా మాట్లాడాలని ఉంది...,
ఎందుకంటే నా జీవితంలో ఇక మిగిలింది అదేగా మరి...
-Kanithi Krishna Chaitanya
Pusyami Sagar ==== పేగు బందం =====
"కొన్ని కలలని కుప్ప గా పోసి
నిన్ను లోకం లో తెచ్చినప్పుడు
ఊహించలేదు పేగు బందం
బరువు గా తోచి దూరం గా విసిరేస్తుంది అని
నీ ఆశల సౌధాలకు
ఇటుకలు గా మారి
ఇంతింతై వటుడింతై నప్పుడు
వెల కట్టలేని సంతోషాన్ని
మూట కట్టుకున్నారు ..
ఇంకొకరి తో నువ్వు ముడి పడినప్పుడు
నూరేళ్ళ ఆశిస్సులని నీలో నింపారు ...
తమ సర్వం ధార పోసినా .....నువ్వు ఇచ్చినదేమిటి ?
స్వార్ధం పొరలతో కప్పబడి
అహంకారం నరనరాల్లో ఎక్కించుకొని
చెప్పుడు మాట లు విని
గుండె ని తూట్లు పొడిచావు ...
తమ కడుపు కట్టుకొని నీ ఆకలి తీరిస్తే....
వంతులేసుకొని ..
పస్తులు పరుండ బెడుతున్నావు .....
"అమ్మా " అని నువ్వు గాయం తో అరిచినప్పుడు
తన ప్రేమ తో నీకు మందు గ మారి తే
నిర్దయ తో ...నిలదీస్తున్నావు
నువ్వెందుకు సచ్చిపోవు అని ....
నీ ప్రతి వోటమి గెలుపు గా మార్చి
దారి చూపిస్తే ....
దిక్కు మొక్కు లేని "అనాధల శరణాలయం " నికి దారి చూపించావు ...
సంస్కారం న్ని తగలబెడుతూ
విలువలన్నీ కాల రాస్తూ ....
నువ్వెంత ఎత్తు లో ఎదిగిన
లోకం అంతా నిన్ను భుజాల ఫై ఎక్కి కీర్తించినా
ఎదగని మొక్కవె ....
మానవత పొలం లో .....
కలుపు మొక్కవె....
తల్లి ..తండ్రులను ఆదరించని పుత్ర్రులు .బిడ్డలు .పుట్టనేల ..గిట్టనేల...
(ఎందరో తల్లి తండ్రులు ...నిరాదరణ కు గురి అవుతూ....అందరు వుంది కూడా అనాధ లా "శరణాలయం లో" బతుకు ఈడుస్తున్న అందరి కి ...అంకితం ...
//సాగర్// 24-07-2013
Kavitha Prasad Rallabandi
నగరం అర్ధం కాని పదాలకుప్పలా ఉంది
వాటిల్లోంచి అక్కడక్కడా అపధ్వనించే రోడ్లు ...
వాటి పైన కవిత్వంలాంటి ఆడపిల్లలు.
రద్దీ లో గుర్తుపట్టడంకష్టమే !
ఏదో సౌందర్యం గొంది లోకి చటుక్కున మాయ మౌతుంది ,
వెతుకుతున్న చూపులు వేరే వైపు వెళ్ళిపోతాయి ....
అన్వేషకుడు ఇంకెటో వెళ్ళిపోతాడు !
ఇక పద్యం కోసం ఎవడు వెతుకుతాడు ?!
వాడి కోసం కవిత్వం ఎదురు చూస్తుందా!!
రాళ్ళబండి శశిశ్రీ // స్వీట్ షాప్ //
అదో స్వీట్ షాప్
నాలుగు రోడ్ల కూడలికి దగ్గరగా
అందరికీ అందుబాటుగా
తీపిరుచుల మేళవింపుతో
అందరి అభిరుచుల కనుగుణంగా
ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది
హడావుడిగా తిరిగే జనాలకు
ఐదు నిమిషాల విడుపు నిస్తూ
ఆకర్షిస్తూ ఉంటుంది
ఆహ్వనిస్తూ ఉంటుంది
మనిషి సంతృప్తి కానంతవరకు
రుచులు మారుతూనే ఉంటాయి
కొత్తరుచులు పుడుతూనే ఉంటాయి
రుచుల్లో జీవితాన్ని
ఆవిష్కరిస్తూ ఉంటారు కొందరు
ఏ రుచులూ ఆస్వాదించలేనివారు
మరికొందరు
అక్కడే నిలబడి తినేవారి తినేవారి
ముఖాల్లో అవ్యక్తానందం
జీవితపు చేదుల్ని
ఆ క్షణాలు మరిపించినట్లుగా
జీవితానికి సరిపడ తియ్యదనాన్నంతా
ఆ కాసేపట్లో పొందినట్లుగా
జీవితంలో మధుర ఘట్టాలలో, విజయాలలో
ఆనందోత్సాహాలను అధికం చేసేది
ఈ తీపి రుచే కదా!
బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు
ఆ స్వీట్ షాప్ చుట్టూ జనాలు
అవును మరి!
జీవితపు తియ్యదనం
మనిషినెపుడూ ఊరిస్తూనే ఉంటుంది
రచనాకాలం- June 2013
కాశి రాజు ॥ మట్టిపొద్దులో మిణుగురు పురుగు ॥
కాశి రాజు ॥ మట్టిపొద్దులో మిణుగురు పురుగు ॥
ఈరోజు
నీ గతమంటే గుర్తొచ్చేది ఒక్కటే
ఒకసారి నీళ్ళు నిండిన పేగులు నిద్దర్రాక చూస్తుంటే
నా లోపల, మనమేఆకలీ తీర్చలేదని మెతుకు మెతుకుతో మాట్లాడడం వింటాను
నాక్కూడా కడుపు నిండదపుడు .
అది గమనించిన మన మిణుగురుపురుగు పొద్దొడవకుండానే పనికి పోవడం చూసి
బడికిపోతూ నా మనసంతా మనూరి చేలల్లోనే ఒదిలేసాను
ఇప్పటికీ అది నా వెంట రాలేదు
పొద్దొడవని పంటచేల్లో నీ మొలకున్న గోచీ తెలుపుదే అని తెలిసింది అమ్మకేనేమో!
ఇప్పుడు అదొక్కసారి ఇస్తావా దాచుకుంటాను .
ఎప్పుడూ చెక్క పెట్టెలో తెల్ల బట్టలు అమ్మెందుకు దాస్తుందీ ?
మీ పెళ్లి బట్టలు కొత్తగా ఉన్నందుకేనా
మీ రంగిప్పుడు మట్టిరంగుమాకు
మట్టిగుమ్మాల్లో మనుషులుంటారని తెలిసాక
మనసెక్కడికీ పోదునాన్నా మీతోనే ఉంది చూడు
ఎప్పుడింటికొచ్చినా మనూళ్ళో ఉదయించే సూరీడు
ఓ మట్టి పొద్దులా కనిపిస్తాడు.
అది నువ్వేనేమో అని నా అనుమానం .
నీ శక్తే తనశక్తిగా మార్చుకుని తిరిగే
మన గుమ్మంలోని తిరిగే మిణుగురుపురుగు, నీకూ నాకూ రాత్రి సూరీడు మా అమ్మే తెలుసా !
(మట్టిపొద్దులో మిణుగురు పురుగు: మా నాన్నలోని మా అమ్మ ! నా ప్రధమ గురువులు వీళ్ళే గనుక ప్రేమతో ఈ రోజు పూజిస్తూ )
ఈరోజు
నీ గతమంటే గుర్తొచ్చేది ఒక్కటే
ఒకసారి నీళ్ళు నిండిన పేగులు నిద్దర్రాక చూస్తుంటే
నా లోపల, మనమేఆకలీ తీర్చలేదని మెతుకు మెతుకుతో మాట్లాడడం వింటాను
నాక్కూడా కడుపు నిండదపుడు .
అది గమనించిన మన మిణుగురుపురుగు పొద్దొడవకుండానే పనికి పోవడం చూసి
బడికిపోతూ నా మనసంతా మనూరి చేలల్లోనే ఒదిలేసాను
ఇప్పటికీ అది నా వెంట రాలేదు
పొద్దొడవని పంటచేల్లో నీ మొలకున్న గోచీ తెలుపుదే అని తెలిసింది అమ్మకేనేమో!
ఇప్పుడు అదొక్కసారి ఇస్తావా దాచుకుంటాను .
ఎప్పుడూ చెక్క పెట్టెలో తెల్ల బట్టలు అమ్మెందుకు దాస్తుందీ ?
మీ పెళ్లి బట్టలు కొత్తగా ఉన్నందుకేనా
మీ రంగిప్పుడు మట్టిరంగుమాకు
మట్టిగుమ్మాల్లో మనుషులుంటారని తెలిసాక
మనసెక్కడికీ పోదునాన్నా మీతోనే ఉంది చూడు
ఎప్పుడింటికొచ్చినా మనూళ్ళో ఉదయించే సూరీడు
ఓ మట్టి పొద్దులా కనిపిస్తాడు.
అది నువ్వేనేమో అని నా అనుమానం .
నీ శక్తే తనశక్తిగా మార్చుకుని తిరిగే
మన గుమ్మంలోని తిరిగే మిణుగురుపురుగు, నీకూ నాకూ రాత్రి సూరీడు మా అమ్మే తెలుసా !
(మట్టిపొద్దులో మిణుగురు పురుగు: మా నాన్నలోని మా అమ్మ ! నా ప్రధమ గురువులు వీళ్ళే గనుక ప్రేమతో ఈ రోజు పూజిస్తూ )
కనులు.......
కనులా అవి చచ
నేరేడిపళ్ళు
కనిపించని అందం ఏమిటో ఉందని
అది ఏమిటో తెలుసుకోలేనని అనుకున్నాను
అదేమిటో ఆ అందం అంతానీ కనులలోనే ఉందని
తెలుసుకునేసరికి ఇంతసమయం పట్టింది
ఖచ్చితంగా చెప్పలేను కాని నీ ముఖారవిందమునకు కారణం
నీ కనులే ఓ నా ప్రియా
అసలు అంతగ నేను నీ కనులను అభినందించేందుకు కారణం
ఏమిటో నాకే తెలియటం లేదు
బహుశా నాకు నీపై ఉన్న ప్రేమ వల్ల అనుకుంట
అసలు నేను నిన్ను ప్రేమిస్తున్ననని చెప్పటానికి ఇన్ని హంగులెదుకో
ఇప్పుడు చెపుతున్నా
నువ్వంటే నాకు ఇష్టం
నన్ను పెళ్ళి చేసుకుంటావా
ఇంతా రాసినందుకైనా కనీసం మౌళికంగా జవాబైనా చెప్పు ప్రియా
నీకు ఇష్టమైతే మన పెళ్ళి
లేకుంటే మనం ఇప్పుడే పరిచయం ఐన స్నేహితులా ఉందాం
ఇట్లు
నీ
కనులా అవి చచ
నేరేడిపళ్ళు
కనిపించని అందం ఏమిటో ఉందని
అది ఏమిటో తెలుసుకోలేనని అనుకున్నాను
అదేమిటో ఆ అందం అంతానీ కనులలోనే ఉందని
తెలుసుకునేసరికి ఇంతసమయం పట్టింది
ఖచ్చితంగా చెప్పలేను కాని నీ ముఖారవిందమునకు కారణం
నీ కనులే ఓ నా ప్రియా
అసలు అంతగ నేను నీ కనులను అభినందించేందుకు కారణం
ఏమిటో నాకే తెలియటం లేదు
బహుశా నాకు నీపై ఉన్న ప్రేమ వల్ల అనుకుంట
అసలు నేను నిన్ను ప్రేమిస్తున్ననని చెప్పటానికి ఇన్ని హంగులెదుకో
ఇప్పుడు చెపుతున్నా
నువ్వంటే నాకు ఇష్టం
నన్ను పెళ్ళి చేసుకుంటావా
ఇంతా రాసినందుకైనా కనీసం మౌళికంగా జవాబైనా చెప్పు ప్రియా
నీకు ఇష్టమైతే మన పెళ్ళి
లేకుంటే మనం ఇప్పుడే పరిచయం ఐన స్నేహితులా ఉందాం
ఇట్లు
నీ
Monday, 22 July 2013
Subscribe to:
Posts (Atom)







