అదో స్వీట్ షాప్
నాలుగు రోడ్ల కూడలికి దగ్గరగా
అందరికీ అందుబాటుగా
తీపిరుచుల మేళవింపుతో
అందరి అభిరుచుల కనుగుణంగా
ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది
హడావుడిగా తిరిగే జనాలకు
ఐదు నిమిషాల విడుపు నిస్తూ
ఆకర్షిస్తూ ఉంటుంది
ఆహ్వనిస్తూ ఉంటుంది
మనిషి సంతృప్తి కానంతవరకు
రుచులు మారుతూనే ఉంటాయి
కొత్తరుచులు పుడుతూనే ఉంటాయి
రుచుల్లో జీవితాన్ని
ఆవిష్కరిస్తూ ఉంటారు కొందరు
ఏ రుచులూ ఆస్వాదించలేనివారు
మరికొందరు
అక్కడే నిలబడి తినేవారి తినేవారి
ముఖాల్లో అవ్యక్తానందం
జీవితపు చేదుల్ని
ఆ క్షణాలు మరిపించినట్లుగా
జీవితానికి సరిపడ తియ్యదనాన్నంతా
ఆ కాసేపట్లో పొందినట్లుగా
జీవితంలో మధుర ఘట్టాలలో, విజయాలలో
ఆనందోత్సాహాలను అధికం చేసేది
ఈ తీపి రుచే కదా!
బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు
ఆ స్వీట్ షాప్ చుట్టూ జనాలు
అవును మరి!
జీవితపు తియ్యదనం
మనిషినెపుడూ ఊరిస్తూనే ఉంటుంది
రచనాకాలం- June 2013
No comments:
Post a Comment