ఇదీ నా పరిస్థి(గ)తి
---------------------------
ఉల్లి ధర
గిల్లి ఏడిపిస్తోంది
సంబారుతో
సరిపెట్టుకుంటాను
మండే పెట్రోలును
బండిలో పోయ్యలేను
షికారు మానేస్తాను
నా చిట్టి తల్లికి
మిటాయిలు కొనలేను
పిప్పరమెంట్ల
గొప్పలు గుప్పించాను
మిద్దే గదుల అద్దె
ఎక్కడనుండి తేను ?
పూరి పాకే చాలు నాకు
రోగమొచ్చి మంచమెక్కాను
లంకణంతో ..
సరిపెట్టుకుంటాను
ఎన్నిసార్లైనా
వోటు వేస్తాను
నా పాట్లు పట్టించుకోకపోయినా
చీకట్లో వోటుకి..
నోట్లు పుచ్చుకున్నాను కదా !!!
-గుబ్బల శ్రీనివాస్
(10/07/13)
---------------------------
ఉల్లి ధర
గిల్లి ఏడిపిస్తోంది
సంబారుతో
సరిపెట్టుకుంటాను
మండే పెట్రోలును
బండిలో పోయ్యలేను
షికారు మానేస్తాను
నా చిట్టి తల్లికి
మిటాయిలు కొనలేను
పిప్పరమెంట్ల
గొప్పలు గుప్పించాను
మిద్దే గదుల అద్దె
ఎక్కడనుండి తేను ?
పూరి పాకే చాలు నాకు
రోగమొచ్చి మంచమెక్కాను
లంకణంతో ..
సరిపెట్టుకుంటాను
ఎన్నిసార్లైనా
వోటు వేస్తాను
నా పాట్లు పట్టించుకోకపోయినా
చీకట్లో వోటుకి..
నోట్లు పుచ్చుకున్నాను కదా !!!
-గుబ్బల శ్రీనివాస్
(10/07/13)
No comments:
Post a Comment