రోజులు వాటంతట అవే గడిచిపోతున్నాయి., ఎలాగోలాగ...,
కానీ, రాత్రులే., నను ఒంటరిని చేసి చంపుతున్నాయి....
గాయాలు ఎన్నటికైనా మానిపోతాయి...,
కానీ., గుర్తులు అలాగే మిగిలిపోతాయి....
విలాసవంతమైన నా పడక మీద...,
విశ్రమించడానికి నేను చేస్తున్నా విశ్వప్రయత్నాలు....
కానీ ఆలోచనలకు విరామం ఇవ్వలేకున్నా....
ఆ అలోచనల భారాన్ని మోయలేకున్నా...
నా గతం నా కళ్ళ ముందు మెదులుతోంది...,
అగ్ని కీలగా మారి నన్ను నిలువునా దహించివేస్తోంది....
కానరాని చీకట్లలో నా జీవితంలోని చీకటి స్ఫుటంగా కనిపిస్తోంది....
నాకు ఆ చీకటితో గొంతు కలపాలని ఉంది.,
ఈ నిశితో కసి తీరా మాట్లాడాలని ఉంది...,
ఎందుకంటే నా జీవితంలో ఇక మిగిలింది అదేగా మరి...
-Kanithi Krishna Chaitanya

No comments:
Post a Comment