Monday, 22 July 2013

బుల్లి

అలసిపోయిన పగలు
రేయిలో నిద్రించువేళ
నేనే ఒంటరి
నేను మాత్రమే ఒంటరి

రెక్కలు విడిచినా
కాలం తీరం వెతకదా
నాలు నలుమూలల
గోడల నడుమ
నేను నేను మాత్రమే ఒంటరి
కనులే అలసినా
చూపులు జీవితమెతకదా

పరుగులు తీసె
అలలులా
నా మనసు వెతకదా
నా జీవితం కోసం వెతకదా

తెలిసి తెలియక
నా మనసుని తలుచునది ఏమిటో
తెలుసుకున్నాను ఈరోజు
జీవమొచ్చింది నేడేగా
కలలు కంటూ బ్రతికాను ఇన్నాళ్ళు
భ్రమే అని తెలుసుకున్నాను ఇప్పుడే

కాలమే నను వదిలిపోయి పరుగులుతీస్తోందిగా
నడకే ఆగినా
మనసే నన్ను వెతకదా
దారే లేకపోయినా
గమ్యం నన్ను చేరదా

కట్టలు విరిగినా
కంట కన్నీరుమాత్రం ఆగవే
క్షణమే నిలిచినా
కనులే కన్నీరు ఆపవే
కనులను మూసినా
చినిగిన చాపలా
కరిగే మైనంలా
కన్నీరు ఆగవే

వెతుకుతున్నా
నాజీవితాన్ని
నడిరాత్రిలో కళ్ళుమూసుకుని
క్షణాలు గడిచిపోతున్నాయి
ననువీడి వద్దు అన్న ఆగకుండ
రేయి-పగలు గడిచెనే

ఒడిమే దుడుకులే
గమ్యం నన్ను నాకు చేర్చవా
కదిలే రాత్రులే
పగటికి చేరవా

నీలిమేఘాన్ని చూసిన సంద్రం
ఎగిరెగిరిపడదా
దిక్కులు పిక్కటిళ్ళినా
తన ప్రయాణము ఆపునా

12జూలై13

No comments:

Post a Comment

Followers