నగరం అర్ధం కాని పదాలకుప్పలా ఉంది
వాటిల్లోంచి అక్కడక్కడా అపధ్వనించే రోడ్లు ...
వాటి పైన కవిత్వంలాంటి ఆడపిల్లలు.
రద్దీ లో గుర్తుపట్టడంకష్టమే !
ఏదో సౌందర్యం గొంది లోకి చటుక్కున మాయ మౌతుంది ,
వెతుకుతున్న చూపులు వేరే వైపు వెళ్ళిపోతాయి ....
అన్వేషకుడు ఇంకెటో వెళ్ళిపోతాడు !
ఇక పద్యం కోసం ఎవడు వెతుకుతాడు ?!
వాడి కోసం కవిత్వం ఎదురు చూస్తుందా!!
No comments:
Post a Comment