Tuesday, 23 July 2013

Mehdi Ali !! నన్ను ప్రేమించలేవు ... !!


ప్రేమపై నీకోక నిర్దిష్టమైన
అభిప్రాయం రానంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

ప్రేమపై నీకున్న కోలామానంతో
సరిచూసుకున్నంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

నమ్మకం అంటే సరైన నిర్వచనం
తెలియనంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

ఆరాధించే వాళ్ళు ఎందరో ఉన్నారనే
అహం నీలో ఉన్నంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

అందరి అభినందనల మత్తు
నీనుండి దిగనంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

ఇతరుల్లోని అంశాలతో
పోల్చి చూస్తున్నంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

అన్నీ ప్రత్యేకలు ఏ ఒక్కరిలో ఉండవన్న
నిజాలు గుర్తించినంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

నీ జీవితాన్ని రహస్యంగా
ఉంచినంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

నా ఆహ్వానంలోని ఆర్ద్రత
నిన్ను కదిలించినంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

నా కవితలోని భావాలు నీకేనని తెల్సిన
మౌనం ఉన్నంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

నీ భావాల్లో నేను ఉంటాననే
నమ్మకం నాలో కల్గించనంత కాలం
నువ్వు నన్ను ప్రేమించలేవు

No comments:

Post a Comment

Followers